తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శనివారం సాయంత్రం 3.30 నుంచి 5 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
|