తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శనివారం సాయంత్రం 3.30 నుంచి 5 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి.
ఈ ఉత్సవాల్లో పగలు, రాత్రి రెండు స్లారు వివిధ వాహనాలపై స్వామివారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఇందు కోసం తితిదే పాలక మండలి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మలయప్ప స్వామి కొలువైన ఏడు కొండలను సర్వాంగసుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ స్థాయిలో పోలీసు బలగాలను మొహరించారు. ప్రధాన ద్వారం అలిపిరి గేటు మొదలుకొని, తిరుమలలోని ప్రతి అణువూ పోలీసుల డేగకన్నులో నిక్షిప్తమైవుంది.
|