కలియుగ దైవంగా పేరొంది.. విశిష్ట పూజలు అందుకుంటున్న దేవ దేవుడైన ఆ శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగిపోతున్నాయి. గత శనివారం కన్నుల పండుగ వాతావరణంలో ధ్వజా రోహణ కార్యక్రమంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సోమవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ మూడో రోజులో భాగంగా.. స్వామివారిని యోగ నారసింహునిగా అలంకరించి బలసామర్థ్యాలకు ప్రతీక అయిన "సింహ"వాహనంపైన ఊరేగిస్తారు.
అనంతరం... రాత్రిపూట కాళీయ మర్థనుడైన బాలకృష్ణునిగా యోగ సాధకులకు ఒక దశలో గోచరించే దివ్యజ్ఞాన సంబంధరూపమైన "ముత్యాలపందిరి" వాహన ఆశీనులై ఊరేగిస్తారు. ఈ సింహ వాహనం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు సాగుతుంది. అనంతరం ఊంజల్ సేవ రాత్రి 7 గం నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు.
ముత్యపు పందిరి వాహనం రాత్రి 9 గం నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సర్వ దర్శనం ఉదయం ఆరు గం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, ఆ తర్వాత రాత్రి ఏడు గంటల నుంచి అర్థరాత్రి 12.30 గంటల వరకు సాగుతుంది.
|