ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
సింహవాహనంపై విహరించిన శ్రీవారు
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడవరోజైన సోమవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడైన శ్రీవారిని దేవస్థానంలోని నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

శ్రీవారి సింహవాహన దర్శనాన్ని తిలకించిన పులకితులైయ్యారు. సోమవారం మధ్యాహ్నం రెండుగంటలకు స్నపన తిరుమంజన వేడుక, రాత్రి తొమ్మిది నుంచి 11 గంటల వరకు ముత్యపు పందిరి వాహన సేవలు జరుగనున్నాయని తితిదే ప్రకటనలో తెలిపింది. ఈ సింహవాహన ఊరేగింపులో భక్తుల గోవిందనామ స్మరణతో పాటు కోలాట నృత్యాలు, చెక్కభజనలు, పండరి భజనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వీడియోను వీక్షించండి
మరిన్ని
హంసవాహనుడైన శ్రీ చక్రధారి
యోగ నారసింహునిగా దర్శనమియ్యనున్న దేవ దేవుడు
మురళీకృష్ణునిగా భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు
పుష్ప ప్రియుడు దేవదేవుడు
నయనాందకరం పుష్ప ప్రదర్శన
బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు