ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
తిరుమలలో అమాంతం పెరిగిన భక్తుల రద్దీ
శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వస్తున్న భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం వరకు అంతంతమాత్రంగా ఉన్న భక్తుల రద్దీ ఆ రోజు సాయంత్రానికి ఆమాంతం పెరిగిపోయింది. ఉదయం తొమ్మిది గంటల వరకు డైరెక్టులైన్‌ ద్వారా దర్శనానికి అనుమతించగా ఆ తరువాత కొద్ది గంటల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు చేరుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులు పూర్తిగా నిండిపోయాయి. సాయంత్రం నాలుగు గంటల సమయానికి క్యూలైను వైకుంఠం దాటి టీబీసీ వరకు చేరింది.

రాత్రి తొమ్మిది గంటల ప్రాంతానికి శ్రీవారి నిత్యన్నదాన క్యాంటీన్ వరకు వచ్చింది. బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైన గరుడసేవ బుధవారం జరుగనుంది. గరుడో త్సవానికి సుమారు నాలుగు లక్షల మంది వస్తారన్న అంచనాతో తితిదే ఏర్పాట్లు చేసింది. పోలీసులు నాలుగు మాడ వీధుల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. తిరుమలలోని 15 ప్రాంతాలలో మెటల్‌ డిటెక్టర్లను ఏర్పాటు చేసి గట్టి నిఘాను కల్పించారు.
మరిన్ని
'జగన్మోహిని'గా దర్శనమివ్వనున్న శ్రీపతి
'సర్వభూపాల' వాహనంపై ఊరేగనున్న శ్రీవారు
కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీపతి
ముత్యాల పందిరిపై మలయప్ప స్వామి
సింహవాహనంపై విహరించిన శ్రీవారు
హంసవాహనుడైన శ్రీ చక్రధారి