ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
ధ్వజ అవరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కలియుగదైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం పల్లకి సేవ, చక్రస్నానం, సాయంత్రం ధ్వజ అవరోహణం జరుగుతుంది. దీంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఘట్టాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పుష్కరిణిలో జరిగే చక్రస్నాన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు, వీఐపీలు ఎక్కువ సంఖ్యలో వస్తారు. వీరిని దృష్టిలో ఉంచుకుని తితిదే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాయంత్రం ధ్వజ అవరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అంతకుముందు.. శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వరునికి మహోన్నత రథంపై అధిష్టించి ఆలయ వీధుల్లో విహరించారు. ఇదే రోజు రాత్రి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగారు.
మరిన్ని
కన్నుల పండుగగా సాగిన శ్రీపతి రథోత్సవం
రమణీయ రథాంగ పాణి.. వేంకటరమణుడు
శ్రీవారి ఆలయచరిత్ర తెలిపే మ్యూజియం
ఆస్థానమండపంలో అలరించిన మాలతి సిస్టర్స్ కచేరి
భక్తులకు వసతులను కల్పిస్తాం: తితిదే
సూర్యవాహనంలో ఊరేగిన వెంకయ్య