ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > గణేష్ చతుర్థి
 
జయ విఘ్నేశ్వర
PTI PhotoPTI
జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో
జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్థారా! నమో నమో
మూషికవాహన! నమో నమో, మునిజనవందిత! నమో నమో
మాయారాక్షస మదాపహరణా! మన్మథారిత! నమో నమో IIజయII

విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక! నమో నమో
విశ్వసృష్టిలయకారణ శంభో! విమల చరిత్రా! నమో నమో IIజయII

గౌరీప్రియసుత నమో నమో గంగానందన! నమో నమో
గంధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవ! నమో నమో IIజయII

నిత్యానందా! నమో నమో నిజఫలదాయక! నమో నమో
నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథనుత నమో నమో IIజయII
మరిన్ని
షోడశ గణపతుల ధ్యానాలు
అష్టోత్తర శతనామ పూజ
గణపతి ప్రార్థన
బొజ్జ గణపయ్య రకాలు
శ్రీ గణేశవ్రతములు
చతురావృత్తి తర్పణం