1. బాలగణపతి ధ్యానం శోIII కరస్థ కదళీచూత పనసేక్షు కపిత్థకం, బాలసూర్యప్రభం దేవం వందే బాలగణాధిరపం. తాIII అరటిపళ్ళ గెలను, మామిడి, పనస, వెలగ పండ్లను, చెరుకుగడను నాలుగు చేతులతోను, తొండముతో ధరించి బాలభాస్కర ప్రభలతో భాసిల్లునట్టి బాల గణాధిపతికి నమస్కరిస్తాను.
2. తరుణ గణపతి ధ్యానం శ్లోIII పాశాంకుశాపూప కపిస్థజంబూ ఫలం తిలాం చేక్షు మపిసన హస్తైః, ధత్తే సదాయ స్తరుణారుణాభః పాయాత్సయుష్మాన్ తరుణో గణేశః. తాIII పాశాంకుశ మోదక కపిత్థ జంబూ ఫలాలనూ, తిలాపూపాన్నీ, తొండంతో ప్రత్యేకించి చెరకుగడనూ ధరించి ఆరు భుజాలతో, ఎర్రటి కాంతులతో శోభిల్లునట్టి తరుణ గణపతి మిమ్మల్ని సంరక్షించును గాక!
3. భక్త విఘ్నేశ ధ్యానం శ్లోIII నారికేళామ్ర కదళీ గుడ పాయస ధారిణం, శరచ్చశాంక సదృశం భజే భక్తగణాధిపం. తాIII నారికేళ, చూత, కదళీ ఫలాలనూ, గుడమి శ్రితపాయస పాత్రనూ ధరించి, తెల్లటి కాంతులతో భాసిల్లుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చు వాడైనట్టి భక్తగణపతిని నేను సేవిస్తాను
4. వీరవిఘ్నేశ ధ్యానం శ్లోIII బేతాళ శక్తి శరకార్ముక ఖేటఖడ్గ - ఖట్వాంగ ముద్గర గదాంకుశ పాశహస్తాన్, శూలంచ కుంత పరశుధ్వజ ముద్వహస్తం వీరం గణేశ మరుణం సతతం స్మరామి తాIII బేతాళశక్తి శర కార్మక ఖేట ఖడ్గ ఖట్వాంగ ముద్గర, గద, పాశ, అంకుశ శూల పరశు ధ్వజాలతో భాసిల్లుతూ చతుర్భుజాలతో ``సిందూర`` నామక రాక్షసుణ్ణి సంహరించినట్టి సిందూర వర్ణంతో ప్రకాశించునట్టి వీరవిఘ్నేశుని నేను స్మరిస్తాను.
|