5. శక్తిగణపతి ధ్యానం శ్లోIII ఆలింగ్య దేవీం హరితాం విషణ్ణాం, పరస్పరాశ్లిష్టక తీ నివేశం సంధ్యారుణం పాశసృణీం వహస్తం భయపహం శక్తి గణేశ మీడే. తాIII కనక ప్రభలతో తేజరిల్లుతూ, అనేకమైనట్టి దేవిని ఆలింగనం చేసుకోడంలోని హస్త, అభయ పాశాంకుశాలను ధరించినట్టీ, దేవిచే కౌగిలింపబడినట్టీ, అరుణ కాంతి కలిగినట్టీ శక్తి గణపతిని నేను ధ్యానిస్తాను.
6. ధ్వజగణపతి ధ్యానం శ్లోIII యః పుస్తకాక్ష గుణదండకమండలు శ్రీః, నిర్వర్త్య మాన కరభూషణ మిందు వర్ణం స్తంభేరమానవ చతుర్భుజ శోభమానం త్వాం సంస్మరేతి ధ్వజగణాధిపతిం స ధన్యః. తాIII పుస్తక అక్షమాల దండ కమండలాలతో కూడి వివధ రత్నాంచిత కర బాహు భూషణాలతో ప్రకాశించే చతుర్భుజాలతో ఒప్పుతూ, ధవళ ప్రభలతో భాసిల్లే ధ్వజగణపతిని సేవించునట్టివాడు ధన్యుడువుతాడు.
7. పింగళ గణపతి ధ్యానం శ్లోIII పక్వచూత ఫల కల్పమంజరీ మిక్షురసాతల మోదకైస్సహ, ఉద్వహన్పరశు హస్త తే నమః- శ్రీ సహాయయుత దేవ పింగనళ. తాIII తొండంతో ఆమ్ర ఫలాన్నీ, నాలుగు చేతులలో కల్ప పుష్పగుచ్ఛ, ఇక్షు ఖండ, చిమ్మిలతో కూడిన మోదక, పరశువులను ధరించీ, లక్ష్మీ సహాయుడైయున్నట్టి పింగళ గణపతి! నీకు నమస్కారము.
8. ఉచ్ఛిష్ట గణపతి ధ్యానం శ్లోIII లీలాబ్జం దాడిమం వీణా శాలి గుంజక్ష సూత్రకం, దథ దుచ్చిష్ట నాయాయం గణేశః పాతు మేచకః. తాIII లీలా పద్మ, దానిమ్మపండు, వీణ, శాలి గుంజాక్షమాలనూ చేతులలో ధరించినట్టి ఉచ్చిష్ట గణపతి నన్ను రక్షించు గాక!
|