9. విఘ్నరాజ గణపతి ధ్యానం శ్లోIII పాశాంకుశం ధరన్నామ ఫలాశీ చాక్షువాహనః, విఘ్నం నిహతు నః సర్వం రక్తవర్ణో వినాయకః. తాIII పాశాంకుశ అభయ, ఆమ్ర ఫలాలను ధరించినట్టీ, రక్త వర్ణాంచితుడైనట్టీ, మూషిక వాహనుడైనట్టీ, విఘ్నరాజు మా విఘ్నాలను పారద్రోలు గాక!
10. క్షిప్రగణపతి ధ్యానం శ్లోIII దంతం ప్రకల్పలతా పాశ రత్న కుంభోవ శోభితం, బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం. తాIII దంత, పాశ, కల్పలత, రత్న కుంభాలతో శోభిల్లునట్టి, అరుణ ప్రభలతో మనోహరుడైనట్టీ క్షిప్ర గణపతిని నేను ధ్యానిస్తాను.
11. హేరంబ గణపతి ధ్యానం శ్లోIII అభయ వరద హస్తః పాశదంతాక్షమాలః పరశుమథ త్రిశీర్షం ముద్గరం మోదకం చ విదధతు నరసింహః పంచమాతంగ వక్త్రః కనక రుచిక వర్ణః పాతు హేరమ్బ నామా. తాIII తొండంతో మోదకాన్నీ, అష్టభుజాలతో అభయ, వరద, పాశ, దంత, అక్షమాల, పరశు, త్రిశూల, ముద్గరాలనూ ధరించి, పంచగజ వదనుడై, సింహవాహనుడైనట్టి హేరంబ గణపతి మిమ్మల్ని రక్షించు గాక!
12. లక్ష్మీగణపతి ధ్యానం శ్లోIII బిభ్రాణశ్శుక బీజపూర కమలం మాణిక్య కుంభాంకుశాన్, పాశం కల్పలతాంచ బాణకలికా ప్రోతస్సరో నిస్సర:, శ్యామో రక్త సరోరుహేణ సహితో దేవి చయస్యాంతికే గౌరాంగో వరదాన హస్తకమలో లక్ష్మీగణేశో మహన్. తాIII తొండంతో మాణిక్య కుంభాన్నీ, హస్తాలలో శుకదాడిమీఫల, కమల, అంకుశ, పాశ, కల్పతరు, ధనుర్బాణాలనూ దాల్చి, కమల హస్త అయిన లక్ష్మితోనూ, వరద అభయాది పదిచేతులతోనూ, గౌరవర్ణంతోనూ ప్రకాశించునట్టి `మహాగణపతి` అన్న పేరు గల లక్ష్మీగణపతి మమ్మల్ని రక్షించు గాక!
|