13. మహాగణపతి ధ్యానం శ్లోIII బిభ్రాణోజ్జక బీజ పూరక గదా దంతేక్షు బాణైస్సమం, బిభ్రాణో మణికుంభశాలి కిణిశం పాశం చ వక్త్రాంచితం. గౌరాంగ్యారుచి రారవిదయుతయా దేవ్యా సనాథాంతికః శోణాంగ శ్శుభమాతనోతు భవతాం నిత్యం గణేశో మహాన్. తాIII మాణిక్య కుంభంతో కూడిన తొండమూ, పద్మ, దాడిమీఫల, గద, దంత, ఇక్షు, బాణ, శాలిమంజరి, పాశ, అభయ దేవ్యాలింగితహస్త, హస్తంతోనూ అరుణ వర్ణాంచితుడైనట్టి స్వామి మీకు శుభాలను చేకూర్చును గాక!
14. భువనేశ గణపతి ధ్యానం శ్లోIII శంఖేక్షు చాప కుసుమేషు కుఠారదంత - పాశాంకుశైః కళమమంజరికా సనాథైః పాణిస్థితైః పరిసమావృత భూషణ శ్రీః విఘ్నేశ్వరో విజయతే కమనీయ గౌరః తాIII శంఖ, ఇక్షుచాప, పుష్పబాణ, పరశు, దంత, పాశ, అంకుశ, కదంబ పుష్ప గుచ్ఛాలను ధరించి నానా రత్నాభరణాలతో భాసిల్లునట్టీ ధవళ ప్రభలతో భాసిల్లునట్టీ భువనేశ గణపతి విజయాలను ప్రసాదించునుగాక!
15. నృత్య గణపతి ధ్యానం. శ్లోIII పాశాంకుశాప కూఠార దన్త చంచత్కరం చారుతరాంగుళీయం, పీతప్రభం కల్పతరో రథస్థం భజామి నృత్తైక పదం గణేశం. తాIII తొండంతో మోదకాన్నీ, చతుర్భుజాలతో పాశాంకుశ పరశు దంతాలనూ ధరించి ప్రకాశిస్తూ కల్పవృక్షం యెక్క అధో భాగంలో నృత్య విన్యాసంతో ఒప్పే పాదాలు కలిగి పీత వర్ణంతో భాసిల్లునట్టి నృత్య గణపతిని నేను సేవిస్తాను.
16. ఊర్థ్వ గణపతి ధ్యానం శ్లోIII కల్హరిశాలి కిణిశేక్షుక చాప బాణ, దంత ప్రరోహ కబరః కనకకోజ్జ్వలాంగః, ఆలింగనోద్యత కరః తటిదాభకట్యా దేవాద్యతి శతృభయ మూర్థ్వ గణేశ్వరన్తే. తాIII కలువ పువ్వు, శాలింజరి, ఇక్షుచాప బాణ, అభయ హస్తాలతో ఒప్పుతూ, దంతంతో, కనకోజ్వలాంగుడై, తటిద్వార్ణాచియైనట్టి దేవిని ఆలింగనం చేసుకోటడంలో వినియోగింపబడినట్టి ఆరు భుజాలు కలిగినట్టి ఊర్థ్వ తాండవ సంపన్నుడైనట్టి గణపతి అభయ ప్రదానం చేసి రక్షించును గాక!
|