దీపావళి అనగానే.. ఆబాల గోపాలతమంతా అత్యంత ఉత్సాహంతో బాణా సంచా కాల్చుతారు. వివిధ రకాల రంగులను వెదజల్లే టపాకాయలను, తారా జువ్వలను పేల్చి అదో రకమైన అనుభూతికి, ఆనందాన్ని పొందుతారు. ఈ దీపావళి కొంగ్రొత్త వెలుగులు నింపనుంది. నేల నుంచి నింగికి దూసుకెళ్లి పెద్ద శబ్దంతో పేలి, పలు రకాల రంగులను వెదజల్లే అనేక ఫ్యాన్సీ టపాకాయలతో పాటు.. ఒక్కసారి వెలిగిస్తే ఆకాశంలోకి రాకెట్ వేగంతో దూసుకెళ్లే తారాజువ్వల వెలుగులు ఈ దీపావళికి కనువిందు చేయనున్నాయి.
ముఖ్యంగా.. స్వదేశంలో తయారైన టపాకాయలే కాకుండా.. చైనాలో తయారైన ఫ్యాన్సీ టపాసులు కూడా ఈ దీపావళికి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ టపాకాయలు వెదజిమ్మే రంగురంగుల వల్ల ఈ దీపావళి మరింత శోభాయమానం కానుంది.
ఈ దీపావళి స్పెషల్... 'విశ్వ కా ఖజానా' దీని పేరులోనే ఈ బాణాసంచా పనితనం చెప్పకనే తెలిసిపోతుంది. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు.. తారాజువ్వలు రాకెట్ వేగంతో ఆకాశంలోకి దూసుకెళతాయి. అనేక సార్లు నింగిలోకి దూసుకెళ్లే విశ్వ కా ఖజానా తారాజువ్వ పెద్ద శబ్దంతో పేలి, కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల కాంతులను వెదజల్లుతుంది. ఈ తారాజువ్వకు బాంబుతో పాటు.. ఫ్లాష్ ఉండటం దీని ప్రత్యేకత.
|