ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > దీపావళి
 
కజ్జికాయలు
కావలసిన పదార్థాలు..
మైదా: 300 గ్రాములు
పాలు: నాలుగు టీ స్పూన్లు
నీరు: సరిపడా
పంచదార పౌడర్: 150 గ్రాములు
నెయ్యి: రెండు టీ స్పూన్లు
నూనె: తగినంత
కొబ్బరి తురుము: రెండు కప్పులు
పాలకోవ: 250 గ్రాములు

తయారీవిధానం:
మైదాపిండిని ఒక బౌల్‌లో తీసుకుని దానికి సరిపడా నీటిని, నాలుగు టీ స్పూన్ల పాలును కలిపి చపాతీ పిండిలా తయారుచేసుకోవాలి. ఈ పిండితో పది చపాతీలను రుద్దుకోవాలి. వాటిని సగంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో వేడయిన బాణలిలో నూనెను పోసి పంచదార, పాలకోవను కాసేపు వేయించండి.

ఇందులో కొబ్బరి తురుమును చేర్చి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ వేయింపును 1 1/2 స్పూన్ తీసుకుని అర్థభాగం చేసిన చపాతీ ముక్కలో మధ్యగా ఉంచి చపాతీనీ "డీ" ఆకారంలో చేసుకుని నూనెలో బ్రౌన్‌ కలర్‌గా వేయించి సర్వ్ చేయొచ్చు.
మరిన్ని
దీపావళి లేహ్యం
బూంది లడ్డు
ఏమిటీ దీపావళి స్పెషల్..
హృదయమే పేలినట్టయింది..
దీపావళికి ఏం కావాలి..
దీపావళి బోనస్..