"చాలా సింపుల్ మావయ్య" తేలిగ్గా అనేసాడు కాళుడు. నాకు చిరాకేసింది. నా చిరాకు న్యాయమైనదే. గతంలో మా ఆఫీసులో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో వేదాంతం గారిని ఛీఫ్ గెస్ట్‌గా పిలుద్దామని వెళ్ళి భంగపడిన అనుభవం నాది. భుజానికున్న సంచిలోంచి కవితల పోటీలకు వచ్చిన అప్లికేషన్‌లలో ఒకదానిని తీసి నాకు అందించాడు. అప్లికేషన్‌ను పంపించిన వారి పేరు నా దృష్టిని ఆకర్షించింది. "వేపకాయల వరదాయిని డాటర్ ఆఫ్ వేపకాయల వేదాంతం" "ఈ అప్లికేష్ తీసుకెళ్ళి మంత్రిగారి సెక్రటరీ గారికి చూపించాను. అరగంటలో మంత్రిగారి నుంచి పిలుపు వచ్చింది. వారి చాంబర్‌లోకి వెళ్ళి "అమ్మాయిగారికి మీ చేతుల మీదుగా బహుమతిని ఇప్పించాలని మా ఆశ" అన్నాను. మారుమాట్లాడకుండా మంత్రి గారు వస్తామన్నారు" కాళుడు చెప్పడం ఆపాడు. నా నోటమాట రాలేదు. మళ్ళీ ఇన్విటేషన్‌లోకి తలదూర్చాను. జడ్జిలలో ఒకరిగా నా పేరుంది. "మంత్రిగారి కుమార్తెకు బహుమతి ముందుగానే నిర్ణయించి మళ్ళీ జడ్జిలెందుకురా" అడిగాను నేను. "ఇది అంతకు ముందు అనుకున్నదిలే మావయ్య... నువ్వు రావాల్సిందే". నేను వస్తానని ఒప్పుకున్న తర్వాత కాని వాడు ఇంటికి వెళ్ళలేదు.
|