ద్వాపర యుగంలోనే స్త్రీల శక్తి సామర్థ్యాలను లోకానికి చాటి చెప్పిన మహిళాశిరోమణి సత్యభామ. కావ్యనాయికగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా, అహంకారానికి నిలువెత్తు చిరునామాగా సత్యభామను ప్రస్తావించే రచనలు అనేకం వెలువడ్డాయి. అంతే కాకుండా రుక్మిణి కన్నా మిన్నగా కృష్ణ ప్రేమను, సాహచర్యాన్ని పొందేందుకు తపించే సామాన్య మహిళగా కూడా పేర్కొన్న కథలు కోకోల్లలు.
అయితే ఆమెను మహిళల సమస్యల పట్ల స్పందించే స్త్రీ మూర్తిగా కొనియాడిన రచనలను వేళ్ళ మీద మాత్రమే లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో మహిళాసాధికారితకు సత్యభామ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. నరకరాసుర సంహారంలో సత్యభామ పోషించిన పాత్ర జగద్వితమైంది. ప్రాగ్జోతిష్‌పురానికి రాజు నరకాసురుడు. భూదేవికి కుమారుడు నరకాసురుడు.
|