ఆంగ్లేయుల పాలనా సంకెళ్ళ నుంచి భరతమాతను విడిపించేందుకు అహింసా మార్గంలో ఉద్యమాలు చేపట్టిన మహా నేత, స్ఫూర్తి ప్రదాత మన జాతిపిత మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్‌లో మోహన్ దాస్.. పుతిలీభాయ్ దంపతులకు 1869 అక్టోబరు రెండో తేదీన జన్మించారు. 1948 జనవరి 30వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో హిందూ ఉన్మాది నాధూరాం గాడ్సే తుపాకీ గుళ్ళకు ప్రాణాలు విడిచారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం 'జై హింద్' అనే నినాదంతో జాతి యావత్తును ఒక్కతాటిపైకి తెచ్చిన మహనీయుడు బాపూజీ. తాను చేపట్టిన ఉద్యమాలు, శాంతి మార్గాలపై తెల్లదొరలు తమ ఉక్కుపాదాలు మోపినా.. వెన్నుచూపకుండా.. పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. మహాత్మాగాంధిజీ చేపట్టిన అహింసామార్గాన్ని చూసి నాటి బ్రిటిష్ ప్రభుత్వం జడిసింది.
|