తన క్రీడా ప్రతిభతో అంతర్జాతీయంగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేసిన టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. పుట్టింది దేశ వాణిజ్యరాజధాని ముంబైలో అయినప్పటికీ.. పెరిగింది మాత్రం మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోనే. 1986 నవంబరు 15వ తేదీన జన్మించిన సానియా మీర్జాకు టెన్నిస్ క్రీడపై చిన్ననాటి నుంచే అత్యంత మక్కువ. ఆరో ఏట నుంచే టెన్నీస్ ఏస్‌ను చేతపట్టిన సానియాకు ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా కోచ్‌గా మెళకువలు నేర్పించాడు.
టెన్నిస్ కోర్టుల్లో కురచదుస్తుల్లో కనిపించే.. సానియా తన ఆట తీరుతో హావభావాలతో కోట్లాది మంది భారతీయులనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 2005 యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో నాలుగో రౌండ్‌కు చేరుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సానియా.. ప్రస్తుతం ప్రపంచంలోని టాప్-30 టెన్నీస్ క్రీడాకారుల్లో ఒకరిగా నీరజానాలు అందుకుంటోంది.
|