బాలీవుడ్‌లో హాస్యచిత్రాలదే హవా అనడానికి 2007 సంవత్సరాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. ఒకప్పుడు బాలీవుడ్ తెర ఇలవేల్పులైన ధర్మేంద్ర, వినోద్ ఖన్నా మరియు మాధురి దీక్షిత్‌లు ముఖానికి రంగు వేసుకుని రంగంలోకి దిగినప్పటికీ కామెడీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోతను వినిపించాయి. కామెడీ చిత్రాలు ధాటికి తెరవేల్పులు నటించిన చిత్రాలు తెరమరుగు కాక తప్పలేదు.
ఈ సంవత్సరపు బాలీవుడ్ చిత్రాలకు ప్రత్యేకతను ఆపాదించే రీతిలో క్రీడారంగానికి సంబంధించినవై దేశభక్తి మరియు మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే రీతిలో (చెక్ దే ఇండియా) అలాగే పరాయిగడ్డ ఆత్మాభిమాన పరిరక్షణను చాటి చెప్పే విధంగా (గోల్) మరియు కుటంబ సంబంధాలను (అప్నే) మూడు చిత్రాలు విడుదల కావడం గమనార్హం.
బాలీవుడ్ వాణిజ్య విశ్లేషకుడు అమోద్ మెహ్రా చెప్పినదానిని అనుసరించి "2007 డిసెంబర్ మొదటి వారానికి 236 సినిమాలు విడుదలయ్యాయి. అటు ఇటుగా హిట్లు మరియు ఫ్లాప్ కాబడిన చిత్రాల శాతం ఒకే విధంగా ఉంది. హాస్యంతోపాటు వినోదాన్ని అందించే చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కట్టారు.
'నమస్తే లండన్', 'పార్ట్‌నర్', 'హే బేబీ', 'భూల్‌భుల్లైయా', 'జబ్ వుయ్ మెట్' మరియు 'ఓం శాంతి ఓం' చిత్రాలు తర్కానికి అందకపోయినా ఫార్మూలా చిత్రాలను కాదని పైవాటిని సగటు బాలీవుడ్ ప్రేక్షకుడు అద్భుతంగా ఆదరించి భారీ హిట్ చిత్రాల కోవలో చేర్చాడు. రొటీన్‌కు భిన్నంగా వైవిధ్యాన్ని ఆపాదించుకున్న 'గురు', 'చెక్‌దే ఇండియా' మరియు 'భేజా ఫ్రై' చిత్రాలు కూడా చక్కగా ప్రదర్శితమయ్యాయని" అమోద్ పేర్కొన్నారు.
|