ఇక తర్వాత వ్యక్తిగా మనం చెప్పుకోవలసింది 18 సంవత్సరాల వయస్సు గల మనీష్ పురోహిత్ గురించి. ఎందుకంటే అతని ఘటనను తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో మనీష్‌ను మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరని మీరు సైతం అంగీకరిస్తారు.
మన రాష్ట్రానికి చెందిన మనీష్ ప్రయాణిస్తున్న బస్సు, ఒక లారీ ఢీకొనడంతో లోహపు కడ్డీ మనీష్ శిరస్సులోకి దూసుకు పోయింది. అయినప్పటికీ ఎటువంటి భయాందోళనలకు గురికాని మనీష్ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించాడు.
అనంతరం మనీష్‌ను వైద్య చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించారు. అక్కడి వైద్యులు మనీష్ శిరస్సులోని లోహపు కడ్డీని తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించారు. లక్ష్మికి శస్త్ర చికిత్స చేసిన శరణ్ పాటిల్, మనీష్‌కు కూడా పునర్జన్మను అందించడం గమనార్హం.
|