అప్పటి నుంచి 116 టెస్ట్ మ్యాచ్‌లలో మురళీధరన్ మొత్తం 710 వికెట్లు తీయగా... షేన్ వార్న్ 145 టెస్ట్‌ల్లో 708 వికెట్లు తీశాడు. అయితే షేన్ వార్న్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగగా మురళీధరన్ మాత్రం ఇంకా కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో తన రికార్డును తీసుకెళ్లి ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడు.
పుట్టింది, పెరిగిందీ శ్రీలంక గడ్డపై అయినా.. తాను ఎక్కువగా అభిమానించేది మాత్రం భరతభాతనే. అందుకే.. తన జీవిత భాగస్వామిగా చెన్నైకు చెందిన పారిశ్రామికవేత్త కుమార్తె మధిమలర్‌ను వివాహమాడాడు ఈ శ్రీలంక క్రికెటర్.
|