మరో యాభై మందికి పైగా గాయపడ్డారు. అక్టోబరు 27వ తేదీన జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీని మావోయిస్టు తీవ్రవాదులు హతమార్చారు. ఈ దాడిలో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబరు 23వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో, వారణాసి, ఫైజాబాద్‌లలో ఒకే సమయంలో ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో ఐదు మందితో పాటు. 13 మంది గాయపడ్డారు.
ఆధునిక పరిజ్ఞానం... హైదరాబాద్‌లోని సునామీ హెచ్చరిక కేంద్రంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు కొత్త పరికరాలను అమర్చారు. వీటివల్ల సునామీ ఏర్పడేందుకు 13 నిమిషాల ముందు.. కనుగొనే వీలుకలిగింది. అలాగే.. శ్రీహరి కోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఇటలీకి చెందిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్పీ-సి8 అంతరిక్ష కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
వివాదాస్పదం... గత ఏప్రిల్ నెల 30వ తేదీన జరిగిన ఎయిడ్స్ అవగాహనాలో భాగంగా.. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో 30 వేల మంది లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ నటుడు రిచర్డ్ గోరీ, బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని బహిరంగంగా ముద్దాడారు. ఇది పెను సంచలనే సృష్టంచగా... హాలీవుడ్ నటుడు నటికి క్షమాపణ చెప్పారు.
ముగిసిన ప్రేమకథ ఎపిసోడ్... బాలీవుడ్‌లో కొద్దిరోజుల పాటు.. ఎన్నో ఎపిసోడ్‌లుగా నడిచిన అభి-ఐష్ ప్రేమ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది ఈ ఏడాదే. వీరి వివాహం ఏప్రిల్ 20వ తేదీన ముంబైలోని అమితాబ్ నివాసంలో అతి ముఖ్యలు, సన్నిహితులు మధ్య జరిగింది.
|