మూడు మెట్రో నగరాలలో ప్రవేశపెట్టబడిన కాస్ (సీఏఎస్) విధానంతో కలుపుకుని మీడియా రంగం చవి చూసిన అభివృద్ధితో పాటు కొత్తగా వచ్చి చేరిన సవాళ్ళను 2007 ప్రతిబింబించింది.
అయితే, వాణిజ్య పోకడలను సంతరించుకోవడంలో జర్నలిజం చూపిస్తున్న అత్యుత్సాహం, భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై జరుగుతున్న దాడులు మరియు విలువలను పాటించే క్రమంలో మీడియాపై పెరుగుతున్న ఒత్తిడి, పాత్రికేయ సమాజాన్ని పునరాలోచనలో పడేస్తోంది.
ఈ సంవత్సరం మీడియా చూపిన సామాజిక క్రియాశీలతకు యావత్ భారతదేశం ప్రశంసల వర్షం కురిపించింది. జెస్సీకాలాల్ మరియు ప్రియదర్శిని మట్టో హత్య కేసులో బాధితులకు న్యాయం చేకూర్చడంలో మీడియా, న్యాయ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే తీరులో వ్యవహరించిందనే విమర్శలు సైతం ఇదే సమయంలో చోటు చేసుకున్నాయి.
|