"నేను తొలిసారి ప్రధానిగా ఎన్నిక కాబడినప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, " పురుషుల స్థానాన్ని ఒక మహిళ కైవసం చేసుకుంది! ఆమెను తుద ముట్టించాలి... ఆమె దారుణంగా చంపబడాలి... ఆమె సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించింది..." తొలి ముస్లిం మహిళా ప్రధాని బెనజీర్ భుట్టో, మత ఛాందసవాదుల వ్యాఖ్యలను ఊటంకించిన వైనమిది. చివరికి అదే సంభవించింది. దారుణమైన మానవ బాంబు దాడిలో ఆమె మరణించారు. ప్రపంచంలో అతి పిన్నవయస్సులోనే (35 ఏట) ప్రధానమంత్రి పదవిని చేపట్టిన నేతగా బెనజీర్ భుట్టో చరిత్ర సృష్టించారు. అలాగే.. ఇస్లామిక్ దేశానికి ప్రధానిగా ఎన్నికైన తొలి మహిళగా సైతం ఆమె పాక్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి పోయారు. బెనజీర్ భుట్టో 1953 జూన్.... |