వ్యవసాయ రుణాల మాఫీ మరియు ఉపశమనం పథకం కింద ఒక హెక్టారు వ్యవసాయ భూమి కలిగిన చిన్నకారు రైతులు, మరియు ఒకటి నుంచి రెండు హెక్టార్ల వ్యవసాయ భూమి కలిగిన సన్నకారు రైతుల వ్యవసాయ రుణాలను పూర్తిస్థాయిలో మాఫీ చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. వ్యవసాయ వృద్ధిరేటును సాధించే నిమిత్తం పలు పథకాలను ఆయన ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అనుసరించి సహకార బ్యాకింగ్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు రూ.3074 కోట్లతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు ప్రకటించారు.
తాజాగా ప్రకటించిన రుణాల మాఫీలో రూ.60 వేల కోట్ల రూపాయల మేరకు.... |