రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడుతుందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా సామాన్యులు మరియు రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా బడ్జెట్ భారీ కేటాయింపులతో సిద్ధమవుతోంది. దీంతోపాటు ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పట్టాలపై చేర్చేందుకు బడ్జెట్ దోహదపడుతుంది. నెలకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలను ఆర్జించే సామాన్యులు ఆహారం, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండాలని కోరుకుంటారని ఢిల్లీ బిజినెస్ స్కూల్ (డీఎస్ఈ) ప్రొఫెసర్ డాక్టర్ ఆదిత్య భట్టాచార్య తెలిపారు. పన్నులు, షేర్ బజార్, కంపెనీల ఉత్థానపతనాలు, నానో కారు తదితరాలు సామాన్యులకు పట్టని అంశాలుగా పేర్కొన్నారు.
బడ్జెట్ అంశాలపై జాతీయ ప్రజా ఆర్థిక వ్యవహారల సంస్థ డైరక్టర్ ఎమ్. గోవిందరావు మాట్లాడుతూ ప్రతి బడ్జెట్‌కు తగు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. బడ్జెట్ రూపొందించడం ద్వారా పలు కేటాయింపులు జరిపే కేంద్ర ప్రభుత్వం, కేటాయింపులు ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నదనే అంశం తాలూకు మూలాలను స్పృశించలేకపోతోందని తెలిపారు. భట్టాచార్య వెల్లడించిన వివరాలను అనుసరించి దేశంలోని 70 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారు.
కార్పోరేట్ కంపెనీలు, ధనవంతుల ప్రయోజనాలు తీర్చేందుకు మాత్రమే బడ్జెట్ ఉపయోగపడుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బడ్జెట్ వల్ల తమకు ఒరిగేదేమీ లేదని సామాన్యులు వ్యాఖ్యానిస్తున్నారు. సామాజిక పథకాల అమలుకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఏ మాత్రం కేటాయింపులు జరుపుతుందనే అంశానికి సామాన్య ప్రజలు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు.
|