ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారతదేశ చరిత్రలో తొలి బడ్జెట్
ఆధునిక భారత్‌లో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత భారత్ - బ్రిటన్ తొలి వైస్రాయ్ లార్డ్ కెనింగ్‌కు దక్కుతుంది. భారత్‌కు 1856-62 మధ్య కాలంలో ఆయన వైస్రాయ్‌గా కొనసాగారు. 1857వ సంవత్సరంలో ప్రథమ భారతీయ స్వాతంత్ర సంగ్రామం జరిగిన అనంతరం 1859వ సంవత్సరంలో వైస్రాయ్ కార్యాలయంలో తొలిసారిగా ఆర్థిక నిపుణుడు జేమ్స్ విల్సన్‌ను ఆర్థిక కార్యదర్శిగా నియమించారు. ఫిబ్రవరి 18వ తేదీ 1860 సంవత్సరంలో జేమ్స్ విల్సన్ వైస్రాయ్ పరిషత్తులో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బ్రిటీష్ ఆర్థిక మంత్రి పరంపరకు కొనసాగింపుగా తనదైన శైలిలో భారతీయ ఆర్థిక స్థితిగతులను విశ్లేషణాత్మకంగా, సమగ్రమైన సమాచారంతో బడ్జెట్ ప్రసంగాన్ని పరిషత్తులో జేమ్స్ విల్సన్ వినిపించారు. అప్పటి నుంచి భారతీయ బడ్జెట్ విధానానికి జేమ్స్ విల్సన్ ఆద్యునిగా నిలిచారు. 1860 తరువాతి కాలంలో దేశ ఆదాయ వ్యయాలను వెల్లడించే బడ్జెట్‌ను వైస్రాయ్ పరిషత్తులో ప్రవేశపెట్టేవారు. అయితే ఆ సమయంలో భారత దేశం దాస్య శృంఖలాలతో విలవిలలాడుతోంది.

దీంతో బడ్జెట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం భారతీయ ప్రతినిధులకు దక్కేది కాదు. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది. స్వాతంత్య్రానంతరం భారత పార్లమెంట్, శాసన సభలలో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌పై భారతీయ పాలకులకు సంపూర్ణ నియంత్రణ ప్రాప్తించింది. స్వాతంత్ర్యం సిద్ధించక ముందు అనగా 1920 సంవత్సరం వరకు ఒక వార్షిక బడ్జెట్ మాత్రమే సభలో ప్రవేశపెట్టేవారు. 1921 సంవత్సరం నుంచి సాధారణ బడ్జెట్ మరియు రైల్వే బడ్జెట్‌లుగా బడ్జెట్‌ను రూపాంతరీకరించారు. వీటితో పాటుగా దేశంలోని ప్రతి రాష్ట్రానికి ప్రత్యేమైన బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం రూపొందించడం ప్రారంభమైంది.
మరిన్ని
బడ్జెట్‌ను తయారు చేసేది ఎవరు?
వ్యవసాయ రంగానికి చేయూత: చిదంబరం
'బడ్జెట్' ఎలా వచ్చింది?
ఈసారి బడ్జెట్‌లో సామాన్యుల వాటా