ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బడ్జెట్‌ దస్తావేజుల సంగతులు
పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఇంచుమించు ఏడు దస్తావేజులు ఉంటాయి. వాటిలో కొన్ని దస్తావేజుల పరిమాణం చిన్నదిగా ఉంటుంది.
1. ఆర్థిక శాఖా మంత్రి ప్రసంగం
ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో సామాన్యమైన ఆర్థికాంశాల పరిచయాన్ని పొందుపరుస్తారు. ఇక రెండవ భాగంలో ప్రత్యక్ష, పరోక్ష అంశాలను ప్రస్తావించడంతో పాటుగా వచ్చే సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టే ఆర్థిక కార్యక్రమాల తాలూకు తొలి దశను చేరుస్తారు.

2. వార్షిక ఆర్థిక కథనం
ఇది బడ్జెట్ దస్తావేజుల్లో అతి ముఖ్యమైంది. ఇందులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాల అంచనాలను సమగ్రంగా పొందుపరుస్తారు.

3. బడ్జెట్ సారాంశం
ఈ బడ్జెట్ దస్తావేజులో బడ్జెట్ ముఖ్యాంశాలను సంక్షిప్తంగా, గ్రాఫ్‌ల రూపంలో పొందుపరిస్తారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరిపే కేటాయింపులను ఈ దస్తావేజులో చేరుస్తారు.

4. ఆర్థిక విధానాలు
ప్రభుత్వం ద్వారా ప్రస్తావనకు నోచుకునే అంశాలను విస్తృతంగా వివరించడంతో పాటుగా ఈ దస్తావేజులో ఆర్థిక విధానాల సమగ్ర వ్యాఖ్యానాన్ని జోడిస్తారు.

5. బడ్జెట్ లభ్యతలు
ఈ దస్తావేజులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి లభించే అన్ని రకాల ఆదాయాలను విస్తృతంగా పొందుపరుస్తారు. గృహ సంబంధిత అంచనాలు, విదేశీ రుణాలను సైతం ఇందులో చేరుస్తారు.

6. బడ్జెట్ వ్యయం
ఈ దస్తావేజులో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ద్వారా జరిగే వ్యయాన్ని చేరుస్తారు. పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల ఖర్చుకు గాను ఎంతమేరకు కేటాయింపులు జరిపేదీ ఈ దస్తావేజులో పొందుపరుస్తారు. కేటాయింపులతో పాటు కేటాయింపు ఏ పరిమాణంలో ఖర్చు అవుతుంది అలాగే ఏ మేరకు మిగులుతుంది అనేది ఇందులో ప్రస్తావిస్తారు.

7. కేటాయింపులకై అభ్యర్థనలు
ఇందులో వేర్వేరు మంత్రిత్వ శాఖలు అభ్యర్థించిన వాస్తవిక గణాంకాలతో పాటు, సంబంధిత మంత్రిత్వశాఖలకు బడ్జెట్‌లో జరిపినన కేటాయింపులను పొందుపరుస్తారు.

వీటితో పాటుగా మొత్తం దస్తావేజుల వివరాలు, వ్యాఖ్యలతో కూడిన మరొక పుస్తకం దస్తావేజులకు జతగా ఉంటుంది.
మరిన్ని
ప్రత్యక్ష పన్నుల తగ్గింపుతో ప్రభుత్వానికి భారం
స్వతంత్ర భారతపు ఆర్థిక మంత్రులు
బడ్జెట్ ఎలా ఉండవచ్చు...
భారతదేశ చరిత్రలో తొలి బడ్జెట్
బడ్జెట్‌ను తయారు చేసేది ఎవరు?
వ్యవసాయ రంగానికి చేయూత: చిదంబరం