ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఒక్క రుణ కేటాయింపుకు 40 మంది అధికారుల తనిఖీలు
FileFILE
వచ్చే కేంద్ర బడ్జెట్‌లో చిన్న, మధ్య తరహా వ్యాపారులు చెల్లిస్తున్న ఉత్పాదక పన్ను శాతాన్ని తగ్గించాలని వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అసోచెమ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వ్యాపారుల రుణాలపై వడ్డీ తగ్గింపుతో పాటు వ్యాపారులకు పలు రాయితీలను ప్రకటించాలని కోరింది. డాలర్ మారకం విలువ తగ్గి రూపాయి విలువ పెరగడంతో లాభాలు పడిపోయి చిన్న, మధ్యతరహా వ్యాపారులు నష్టాలపాలవుతున్నారు. అనంతరం వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితి తలెత్తుతోంది.

కనుక పెద్ద వ్యాపార సంస్థలతో పాటుగా చిన్న వ్యాపార సంస్థలకు కూడా రుణాల వడ్డీపై రాయితీలను కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి అసోచెమ్ విన్నవించుకుంది. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు అనుకూలంగా రుణ విధానాన్ని సవరించడంతో పాటు ఉత్పాదక పన్నును 12 శాతానికి తగ్గించాలని కోరింది. సర్కారీ రాజ్ వ్యవస్థలో అధికారుల దోరణికి వ్యాపారులు ఇబ్బంది పాలవుతున్నారు.

వ్యాపారులకు రుణాన్ని కేటాయించే క్రమంలో 40 పై చిలుకు ప్రభుత్వ అధికారులు వ్యాపారుల కార్యకలాపాలను, కార్యక్షేత్రాన్ని తనిఖీ చేస్తుంటారు. అధికారుల అలుపెరుగని తనిఖీలతో, ప్రశ్నల పరంపరతో వ్యాపారుల విలువైన సమయం వృధా అవుతోంది. కనుక రుణ కేటాయింపు నిమిత్తం తనిఖీ చేసే అధికారుల సంఖ్యను తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసోచెమ్ విజ్ఞప్తి చేసింది.
మరిన్ని
ధీర్ఘకాలపు అదనపు పన్ను (సెస్) సమంజసమేనా?!
బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల మాఫీ?!
పల్లె భారతానికి బడ్జెట్ వరాలు?!
మహిళలు, రైతులకు ఊతమిచ్చే బడ్జెట్
వార్షిక బడ్జెట్‌లో అభివృద్ధికి అగ్రతాంబూలం?!
రైలు ఛార్జీల పెంపుపై పెదవి విప్పని వేలు