|
కేంద్ర బడ్జెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు...?
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | మరో మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చూచాయగా ప్రకటించారు. చిదంబరం తన బడ్జెట్‌ను రైతులకు, మహిళలకు ప్రయోజనకరంగా ఉండేలా తీర్చిదిద్దుతారని పేర్కొన్నారు.
సోనియా ప్రకటన వందశాతం నిజరూపం దాల్చటం ఖాయం. పైగా వచ్చేది ఎన్నికల సంవత్సరం. అందువల్ల ఓటర్లను ఆకర్షించేలా చిదంబరం తన చిట్టా పద్దును రూపొందిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవల రాష్ట్ర విత్త మంత్రి కొణిజేటి రోశయ్య 'పన్నులు లేని బడ్జెట్' ప్రవేశపెట్టి ప్రజలను ఆకర్షించేందుకు 'భారీ' కసరత్తే చేశారు. 'అదే టైపు'లో మన చిదంబర 'రహస్యం' కూడా ఉంటుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వివిధ రంగాలలో ప్రస్తుతం వసూలు చేస్తున్న సుంకాలను కాస్త సడలిస్తారని విశ్లేషకులు అంటున్నారు.
ఏదెమైనప్పటికీ నిత్యావసర వస్తు ధరలు సామాన్య జీవులను ఇబ్బందిపెడుతూనే ఉన్నాయి. ఇక పెరిగిన పెట్రోల్ ధరల సెగకు మధ్యతరగతి మానవులు విలవిలలాడుతున్నారు. ఈ నేపధ్యంలో మీరే ఆర్థిక మంత్రి స్థానంలో ఉన్నట్లయితే బడ్జెట్ రూపకల్పనలో ఏయే పన్నులను ఎత్తివేస్తారు... ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తారు...? ఇత్యాది అంశాలపై వెబ్‌దునియా తెలుగు మీ అభిప్రాయాలను, సూచనలను కోరుతోంది. తప్పక తెలియజేస్తారు కదూ...
|