రెండో తరగతి ప్రయాణ చార్జీలను ఐదు శాతం మేరకు తగ్గిస్తున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఈ తగ్గింపు యాభై రూపాయలు పైబడిన చార్జీలకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. అలాగే.. ఏసీ మొదటి తరగతికి ఏడు శాతం, రెండో తరగతికి నాలుగు శాతం, మరియు మూడో తరగతికి మూడు శాతం చొప్పున ప్రయాణ చార్జీల్లో తగ్గింపు విధిస్తున్నట్టు మంత్రి తెలిపారు.
మరో పది గరీభ్‌రథ్ రైళ్లు... దేశ వ్యాప్తంగా 53 కొత్త రైళ్లతో పాటు.. ఇపుడున్న గరీభ్‌రథ్ రైళ్ళకు అదనంగా మరో పది గరీభ్‌రథ్ రైళ్లు తమ సేవలు అందిస్తాయని కేంద్ర మంత్రి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లో విద్యను అభ్యశిస్తూ.. తమ సొంత ప్రాంతాలకు వచ్చే 12వ తరగతిలోపు విద్యార్థులకు ప్రయాణ చార్జీల్లో రాయితీని కల్పిస్తామని లాలూ ప్రకటించారు. అశోకచక్ర పురస్కార గ్రహీతలకు ,డెకరేటెడ్ సైనికులకు చార్జీల్లో ప్రత్యేక రాయితీలు కల్పిస్తామన్నారు.
|