ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వినియోగదారులే మా దేవుళ్లు: లాలూ
అనుకున్నట్టుగానే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైలు బండి లాభాల బాటలో పయనించింది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో 25 కోట్ల రూపాయల నికర లాభం సాధించినట్టు ఆయన ప్రకటించారు. 2008-09 సంవత్సర రైల్వే వార్షిక బడ్జెట్‌ను ఆయన మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. లాలూ ప్రసంగానికి తొలుత అడ్డు తగిలిన ప్రతిపక్ష సభ్యులు ఆ తర్వాత సద్దుమణిగారు. ఆ తర్వాత లాలూ ప్రసంగ పాఠం సాగింది.

తమ శాఖ సేవలు, పనితీరుపై ప్రతి ఒక్కరు సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల లాభాల అర్జించినట్టు ప్రకటించారు. వచ్చే కొత్త ప్రాజెక్టుల కోసం 49,250 కోట్లను ఖర్చు చేసినట్టు ప్రకటించారు. అలాగే రద్దీ సీజన్‌లలో ప్యాసింజర్ రైళ్ళ సంఖ్యను పెంచుతామని ఆయన ప్రకటించారు. అలాగే.. రైల్వే సేవలు 79 శాతం మేరకు పెరిగాయని ఆయన వెల్లడించారు.

యూపీఏ విధానాలతోనే రైల్వేకు లాభాలు
కేంద్రంలోని యూపీఏ సర్కారు అమలు చేస్తున్న విధాన వల్లే రైల్వే శాఖ లాభాలను అర్జిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. మంగళవారం ఆయన విజయవంతంగా ఐదో సారి రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. యూపీఏ విధివిధానాలు రైల్వే శాఖను లాభాల బాటలో పయనింపజేస్తోందని ప్రకటించారు. అలాగే.. సరకుల రవాణా ద్వారా 20,000 కోట్ల మేరకు లాభాలను అర్జించినట్టు ఆయన ప్రకటించారు.
1 | 2  >>  
మరిన్ని
రెండో తరగతి ప్రయాణ చార్జీల్లో ఐదు శాతం తగ్గింపు
కేంద్ర బడ్జెట్ ఎలా ఉండాలనుకుంటున్నారు...?
లాలూ సినిమా 'ఆమ్‌ఆద్మీ' రేపే విడుదల
ఒక్క రుణ కేటాయింపుకు 40 మంది అధికారుల తనిఖీలు
ధీర్ఘకాలపు అదనపు పన్ను (సెస్) సమంజసమేనా?!
బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల మాఫీ?!