అలాగే పేలోడ్ లక్ష్యాన్ని 790 టన్నుల మేరకు సాధించినట్టు లాలూ తెలిపారు. అన్ని రైళ్ళలో మోడరన్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. శతాబ్ధి, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సొఫిస్టిగేటెడ్ కోచ్‌లను అమర్చనున్నట్టు లాలూ తెలిపారు. ఈ-టిక్కెటింగ్ కౌంటర్ల సంఖ్యను మరో ఏడాదిలో లక్ష నుంచి మూడు లక్షలకు పెంచుతామని తెలిపారు. వచ్చే 2009 నాటికి ఐటీ మార్గాల మీదుగా రైలు సర్వీసులను నడుపనున్నట్టు లాలూ ప్రకటించారు. రైలు రాకపోకను ముందుగానే మరో స్టేషన్‌లో తెలిసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
రైల్వే ఉద్యోగాల్లో మహిళలకు ఐదు శాతం రిజర్వేషన్లు తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తొలిసారి చేసిన లోక్‌సభ బడ్జెట్ ప్రారంభ ప్రసంగంలో మహిళల రిజర్వేషన్ ఊసెత్తక పోయినా మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడంతో ముందు నిలిచిన కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన రైల్వే బడ్జెట్ ప్రసంగంలో మహిళలను ఆకట్టుకునేలా వరాల జల్లును కురిపించారు. రైల్వే శాఖ ఉద్యోగాల భర్తీలో మహిళలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు సభాముఖంగా తెలిపారు. తద్వారా యూపీఏ ప్రభుత్వ రైలును ఎన్నికల పట్టాలపైకెక్కించారు.
అంతేకాకుండా తాను మహిళా వ్యతిరేకిని కాననే విషయాన్ని కూడా తన బడ్జెట్ ప్రసంగంలో ఆయన తేటతెల్లం చేశారు. అలాగే మహిళా విద్యార్థులకు, సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో యాభై శాతం రాయితీలు అందిస్తామని తెలిపారు. అశోకచక్ర అవార్డు గ్రహీతలకు కూడా రైలు చార్జీల్లో రాయితీ కల్పించనున్నట్టు ప్రకటించారు. వీటితో పాటు రైళ్లలో పరిశుభ్రతను ఇకపై ప్రైవేటు భాగస్వామ్యానికి అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు.
|