కేంద్ర రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రవేశపెట్టిన రైల్వే వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి ఎప్పటిలాగానే ఈ దఫాకూడా మొండి చేయి చూపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వాటితోనే లాలూ రైలు బండిని పొడగించారు. ఇందులోభాగంగా సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను అదిలాబాద్ వరకు పొడగిస్తారు. అలాగే మచిలీపట్నం - బెంగుళూరు, విశాఖపట్నం - సికింద్రాబాద్‌ల మధ్య వారానికి మూడు రోజుల పాటు నడిచే ఎక్స్‌ప్రెస్ రైలును కొత్తగా ప్రవేశపెడతారు.
కొత్తవలస - కిరండోల్ - జగ్‌దల్‌పూర్ డబ్లింగ్ పనులు సర్వే పనులు చేపడతారు. నంద్యాల - ఎర్రగుట్ల, జగ్గయ్యపేట - జానపాడు - విష్ణుపురం మధ్య కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. విజయనగరం - కొత్త వలసల మధ్య మూడో లైను నిర్మాణం చేపడతారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సౌకర్యాలు కల్పిస్తారు. కృష్ణపట్నం పోర్టుకు కొత్త రైల్వే లేనును నిర్మిస్తారు. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వారంలో మూడు రోజుల పాటు నడిచే గరిభ్‌రథ్ రైలును నడుపుతారు.
|