కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి లలూ ప్రసాద్ యాదవ్ మంగళవారం ప్రవేశపెట్టిన 2008-09 వార్షిక బడ్జెట్‌లో 53 కొత్త రైళ్లను ప్రకటించారు. వీటితో పాటు మరో పది గరీభ్ రథ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఐదోసారి విజయవంతంగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో లాలూ ప్రకటించిన కొత్త రైళ్ల వివరాలు...
గరీభ్‌రథ్ రైళ్లు... జబల్‌పూర్ - చంఢీఘర్, సికింద్రాబాద్-విశాఖపట్నం, వారణాసి-ఢిల్లీ, బెంగుళూరు-కొచ్చువేలి, యశ్వంత్‌పూర్-పాండిచ్చేరి, పుణె-నాగ్‌పూర్, జబల్‌పూర్-ముంబై.
కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. అమరావతి-ముంబై, డిబ్రుఘర్-కామఖ్య, మచిలీపట్నం-బెంగుళూరు, సూరత్-ముజఫర్‌పూర్, సూరత్-ముఝాఫర్‌పూర్, అమృతసర్-కొచ్చువేలి, ఢిల్లీ-అమృతసర్, ఇండోర్-ఉదైయ్‌పూర్, వారణాసి-రామేశ్వరం, మధుర-ఛాప్రా, గ్వాలియర్-ఇండోర్, పూరి-ధర్బంగా, వాస్కో-పాట్నా, బిస్లాపూర్-పూణె, గయా-చెన్నై, డిబ్రూఘర్-యశ్వంత్పూర్, లక్నో-ఢిల్లీ, అహ్మదాబాద్-పటాన్, చెన్నై-గయ (వీక్లీ), విశాఖపట్నం-పూణె, గ్వాలియర్-ఇండోర్, చెన్నై-సేలం, అహ్మదాబాద్-ముంబై, అహ్మదాబాద్-పాట్నా ప్యాసింజర్, పూణె-ఢిల్లీ (స్పెషల్ ట్రైన్).
|