ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పేదలకు ఆరోగ్య బీమా.. చిదంబరం
దారిద్యరేఖకు దిగువున వుండే పేద ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రకటించారు. ఆయన 2008-09 వార్షిక బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రకటించారు. ఇందులో ఆరోగ్యం, విద్యా రంగాలకు 20 శాతం నిధులను కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఆరోగ్య రంగానికి ఈ దఫా 15 శాతం నిధుల మేరకు పెంచారు.

ఆరోగ్య రంగానికి మొత్తం 16,534 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధుల్లో రూరల్ హెల్త్ మిషన్‌కు 462 కోట్లను కేటాయించారు. ఎన్‌ఆర్ఈజిసి పథకాన్ని దేశంలోని 596 గ్రామీణ జిల్లాలకు విస్తరించనున్నట్టు ప్రకటించారు. ఈ పథకానికి 1600 కోట్లను కేటాయించినట్టు చెప్పారు. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌కు భారీ స్థాయిలోనే కేటాయించారు.
మరిన్ని
ఆంధ్రప్రదేశ్‌లో ఐఐటీ ఏర్పాటు: చిదంబరం
2008-09 వార్షిక బడ్జెట్ చిట్టా విప్పనున్న విత్తమంత్రి
వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితి పెంపు..?
దక్షిణ మధ్య రైల్వేకు తగ్గిన నిధుల కేటాయింపు
వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన కొత్త రైళ్ల వివరాలు..
కృష్ణా ఎక్స్‌ప్రెస్ అదిలాబాద్ వరకు పొడగింపు