ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > బడ్జెట్ 2008-09
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పెట్టుబడుల వెల్లువకు ఊతమిచ్చే బడ్జెట్: విత్తమంత్రి
తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పెట్టుబడులకు ఊతమిచ్చే విధంగా వుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం వార్షిక బడ్జెట్‌ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి రుణ సదుపాయాల కల్పనపై బడ్జెట్ కసరత్తులో ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ఆయన వివరించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే కారకాల్లో రుణ సదుపాయం ఒకటిగా ఆయన పేర్కొన్నారు.

ఇందులోభాగంగానే 60 వేల కోట్ల రూపాయల విలువ గల వ్యవసాయ రుణాలను మాఫీ చేసినట్టు చిదంబరం వివరించారు. ఈ రుణాల మాఫీ వల్ల చిన్న, సన్నకారు రైతులు సంపూర్తిగా లబ్ధి పొందుతారని ఆయన తెలిపారు. అలాగే ఈ పెట్టుబడులను సృష్టించడమే కాకుండా వృద్ధికి దారితీసి దేశ సౌభాగ్యానికి శ్రీకారం చుడుతుందని ఆయన చిదంబరం అభిప్రాయపడ్డారు.
మరిన్ని
సామాన్యులకు కొండంత అండ: ప్రధాని
సెన్సెక్స్ పతనం 508 పాయింట్లు
చిదంబరం వార్షిక బడ్జెట్‌ హైలెట్స్..
ఆదాయపన్ను పరిమితి రూ.1.50 లక్షలకు పెంపు
బడ్జెట్ దెబ్బకు కుదేలవుతున్న సెన్సెక్స్
అన్నదాతకు వరం.. రుణదాతకు ఖేదం