ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > స్నేహితుల రోజు > హితుడు... మీ స్నేహితుడు...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హితుడు... మీ స్నేహితుడు... Search similar articles
Friend
WD
స్నేహానికున్న విలువ వెలకట్టలేనిది. ఈ లోకంలో స్నేహితుడు/ స్నేహితురాలు లేకుండా ఏ వ్యక్తి వుండరు. అంతటి ఉన్నతమైన స్నేహానికున్న ప్రాధాన్యతను చెప్పేందుకు ఏర్పటైనదే స్నేహితుల రోజు. స్నేహితుల రోజును ప్రతి ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకుంటారు.

1935లో అమెరికా కాంగ్రెస్ "ఫ్రెండ్‌షిప్‌డే"ను ప్రకటించింది. స్నేహ మాధుర్యాన్ని చవిచూసిన ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయంతో ఏకీభవించారు. ఫలితంగా ప్రపంచంలో నేడు అనేక దేశాలు స్నేహితుల రోజును జరుపుకుంటున్నాయి.

ప్రతి ఏటా తమ తమ మిత్రులకు సంప్రదాయబద్దంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ వుంటారు మిత్రులు. సుదూర ప్రాంతాలలో వున్న మిత్రులందరూ ఒకచోట చేరి స్నేహితుల రోజున కలిసి విందులు, వినోదాలలో పాల్గొనడం జరుగుతోంది. అయితే ఈ స్నేహుతుల రోజులలోనూ రకాలున్నాయి. అవేంటంటే...

జాతీయ స్నేహితుల రోజు మొదటి ఆగస్టులో వచ్చే ఆదివారం జరుపుకుంటారు.
అలాగే మహిళా స్నేహితుల రోజును ఆగస్టు మూడో ఆదివారం సెలబ్రేట్ చేసుకుంటారు
అదేవిధంగా అంతర్జాతీయ స్నేహితుల నెలగా ఫిబ్రవరి మాసాన్ని పరిగణించారు
ఇక పాత స్నేహితులు, కొత్త స్నేహితుల వారాన్ని మే మూడోవారంలో జరుపుకుంటారు.

ఇలా ఎన్ని వర్గాలుగా విభజించినా స్నేహితుడు... ఎప్పుడు హితుడే కదా...