ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > స్నేహితుల రోజు > జగత్తులో అద్వితీయమైనది : స్నేహ బంధం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జగత్తులో అద్వితీయమైనది : స్నేహ బంధం Search similar articles
Munibabu
WD
స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీకవి. జగత్తులో ఎన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నా స్నేహబంధం అనేది మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. మిగిలిన అన్ని బంధాలు ఏదో రూపంలో మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో ప్రవేశిస్తాయి. కానీ స్నేహబంధం మాత్రం పూర్తిగా మన ఇష్టంతో, మనకు నచ్చినవారితోనే ఏర్పడుతుంది.

అందుకే స్నేహమనే బంధం ప్రతి మనిషి జీవితంలోనూ ఓ విడదీయలేని బంధంగా పెనవేసుకుంటుంది. మురికి బట్టలో కుచేలుడు కట్టి ఇచ్చిన అటుకులని అమృత ప్రాయంగా భావించి శ్రీకృష్ణుడు స్వీకరించాడంటే అది వారిమధ్య ఉన్న స్నేహబంధంలోని గొప్పతనం. తనవారికెవరికీ ఇష్టం లేకున్నా కర్ణుడికి దుర్యోధనుడు అంగరాజ్యాన్ని పంచి ఇచ్చాడంటే అదీ స్నేహంలోని గొప్పతనమే. ఇలా చెప్పుకుంటూ పోతే తరాలుగా స్నేహబంధాన్ని చాటిన సంఘటనలు కోకొల్లలు.

ఆధునిక జీవితంలోనూ స్నేహాని ఉన్న ప్రాముఖ్యం, గొప్పతనం ఏమాత్రం తగ్గలేదు. తల్లి, తండ్రి, బంధువు, భార్య ఇలా ఏ బంధమూ లేని వారెందరో సమాజంలో ఉండొచ్చు. కానీ నాకు స్నేహితులే లేదు అనే వారు బహు అరుదుగానే ఉంటారు. ఎందుకంటే పరిచయమనే పునాదిపై ఏర్పడి ఎలాంటి స్వార్థం లేకుండా జీవితాంతం తోడు నిలిచేదే స్నేహబంధం.

అలాంటి బంధాన్ని రుచి చూడని మనిషి ప్రపంచంలోనే బహుశా ఉండకపోవచ్చు. అందుకే స్నేహ కుసుమాలు వికసించని జీవితంలో ఎన్ని వసంతాలు వచ్చినా అవన్నీ ఖచ్చితంగా నిష్పలమే. జీవితంలో మనకు ఎన్ని బంధాలున్నా వారంతా మనల్ని అర్థం చేసుకోవడంలో ఏదో ఓ క్షణంలో, ఏదో ఓ రూపంలో పొరబడవచ్చు.
1 | 2  >>  
మరిన్ని
హితుడు... మీ స్నేహితుడు...