ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > స్నేహితుల రోజు > జగత్తులో అద్వితీయమైనది : స్నేహ బంధం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జగత్తులో అద్వితీయమైనది : స్నేహ బంధం
ఎందుకంటే చెప్పలేని, చెప్పుకోలేని ఏదోభావం మిగిలిన బంధాల సమక్షంలో పెదవి దాటకపోవచ్చు. కానీ స్నేహమనే బంధం సమక్షంలో మనిషి తనను సంపూర్ణంగా ఆవిష్కరించగలడు. తనలోని ఆనందాలని, మరెవరూ చూడని అగాధాలని స్నేహితుల ముందు మనిషి బహిర్గతం చేస్తున్నాడు అంటే స్నేహబంధంపై తరాలుగా మనిషికి ఎంతటి విలువ, నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు.

కాలం ఆధునికత సంతరించుకుంటున్న ప్రస్తుత తరుణంలో మనిషితో సంబంధాన్ని కాంక్షించే అన్ని బంధాల్లోనూ పెను మార్పులు చేసుకుంటున్నాయి. ఆ బంధాలను నిలబెట్టుకోవడానికి, ఆ బంధాల ద్వారా మనిషి జీవితంలోకి ప్రవేశించిన వారిని తృప్తి పర్చడానికి మనిషి ఎన్నో త్యాగాలు, మరెన్నో విన్యాసాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కానీ జీవితంలో ఒక్కసారి స్నేహబంధం అడుగుపెడితే ఆ బంధం అలాగే ఏ స్వార్థం లేకుండా మనిషినుంచి కాసింత స్నేహాన్ని తప్ప మరేమీ ఆశించకుండా అలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అందుకే స్నేహబంధాన్ని కాపాడుకోవడానికి మనిషి తన స్నేహాన్ని తప్ప మరేమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం, అగత్యం నేటికీ కలగలేదు.

జీవితంలో అన్ని చోట్లా నిరాశ, నిస్పృహలు ఎదురై మనిషిని వెక్కిరించిన క్షణంలో ఏమీ కాదు, నువ్వు దేనినైనా సాధించగలవు, నీలో ఆ ప్రతిభ ఉంది... అది నాకు తెలుసు అంటూ ఆప్యాయంగా వెన్ను తట్టి ప్రోత్సహించేదే స్నేహబంధం. అలాంటి స్నేహబంధాన్ని పొందగల్గిన మనిషి జీవితంలో ఏనాడూ కృంగిపోయే పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే స్నేహం ద్వారా మన హితాన్ని కోరేవారే కదా స్నేహితులంటే...
<< 1 | 2 
మరిన్ని
హితుడు... మీ స్నేహితుడు...