స్నేహమేరా జీవితం... స్నేహమేరా శాశ్వతం... అన్నాడో సినీకవి. జగత్తులో ఎన్ని బంధాలు, అనుబంధాలు ఉన్నా స్నేహబంధం అనేది మాత్రం మనిషి జీవితంలో చాలా ప్రత్యేకమైనది. మిగిలిన అన్ని బంధాలు ఏదో రూపంలో మన ప్రమేయం లేకుండానే మన జీవితంలో ప్రవేశిస్తాయి. కానీ స్నేహబంధం మాత్రం పూర్తిగా మన ఇష్టంతో, మనకు నచ్చినవారితోనే ఏర్పడుతుంది.
అందుకే స్నేహమనే బంధం ప్రతి మనిషి జీవితంలోనూ ఓ విడదీయలేని బంధంగా పెనవేసుకుంటుంది. మురికి బట్టలో కుచేలుడు కట్టి ఇచ్చిన అటుకులను...