అహింసాయుత మార్గంలో బాపూజీ మన దేశానికి స్వేచ్ఛా వాయులను అందించారు. అయితే కొన్ని అసాంఘిక శక్తులు ఈ స్వేచ్ఛా వాతావరణంలో భయోత్పాతాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బెంగుళూరు, అహ్మదాబాదు వరుస పేలుళ్లతో ప్రజలను భీతిగొలిపాయి. దేశంలో ఏ మూలన పేలుడు జరిగినా దాని మూలాలు మన రాష్ట్రరాజధానితో అనుసంధానించబడి ఉండటం కలవరపెడుతున్న మరో అంశం.
నిఘా వర్గాల హెచ్చరికలు చూస్తుంటే... ప్రతి క్షణం, ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నట్లు కనబడుతోంది. స్వేచ్ఛా భారతంలో స్వాతంత్ర్యం సంబరాలను అత్యంత కట్టుదిట్టమైన... |