స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా మహాత్మాగాంధీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా చోట్ల పర్యటించారు. అప్పట్లో ఆయనకు తెలుగు జనం నీరాజనం పట్టారు. ఇంచుమించు 12 రోజుల పాటు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని పల్లెల్లో ఆయన కాలు మోపారు. పోయిన చోటల్లా ఉపన్యాసాలు ఇచ్చి చాలా మందిని ఉద్యమం వైపు ఆకర్షించ గలిగారు. ఆయన పర్యటనలలో చాలా చొట్ల దళిత గ్రామాలను సందర్శించారు.
వారి కోసం ఆలయాలను నిర్మింప చేశారు. ఆలయాలలో వారి ప్రవేశం కల్పించేందుకు ప్రయత్నం చేశారు. వారిలో ఛైతన్యం కోసం కార్యక్రమాలను చేపట్టారు. బ్రిటీష్ వారిని తిరుమల ఆలయంలో దర్శనం కల్పించగా లేని భారత జాతీయులైన వారిని ఎందుకు అనుమతించరని అప్పటి కమిషనర్‌ను ప్రశ్నించారు. దళితులకు బాసటగా నిలిచారు. ఆయన రాకకు పల్లె పల్లె వేయి కళ్ళతో ఎదురు చూశారు. బహిరంగ సభలకు భారీ ఎత్తున తరలి వచ్చారు. మహాత్ముడి ఆంధ్రా పర్యటన 1933లో ఇలా సాగింది.
1933 డిసెంబర్ 16: ఉదయం 3 గంటల ప్రాంతలో బెజవాడ చేకురున్న ఆయనకు భారీ స్వాగతం లభించింది. అదే రోజు పడమట లంక, ఇడుపుగల్లు, మంగళరాజాపురాలను సందర్శించారు. అక్కడి జనాన్ని కలుసుకున్నారు. బెజవాడలో దళిత ప్రాంతాలలోని జనాన్ని కలుసుకున్నారు. మహిళలు ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడారు.
డిసెంబర్ 17: ముదునూరులో దళితుల కోసం రెండు దేవాలయాలను ఆరంభించారు. గుడివాడ, ముసిపట్నం బహిరంగ సభలో మాట్లాడారు. సిద్ధంటం లో కూడా ఆయన దళితుల దేవాలయాన్ని ఆరంభించారు. అదే సమయంలో చెల్లపల్లె, అంగలూరు, గుడ్లవల్లేరు, కవుటారం, పెద్దన గ్రామాలను అదే రోజు సందర్శించారు. డిసెంబర్ 18: ఆయన ఈ రోజును మసులి పట్నంలో మౌనవ్రతం పాటించారు.
డిసెంబర్ 19: కంకిపాడు, పమరు, బాట్లపెనుమార్రు ప్రాంతాలలో సాయంత్రం పర్యటించిన ఆయన తిరిగి బెజవాడ చేరుకున్నారు. అక్కడు నుంచి చెన్నైకు బయలు దేరారు. డిసెంబర్ 22: చెన్నైలో జరిగిన ఆంధ్రమహాసభలో నాగేశ్వర రావు చిత్రపటాన్ని గాంధీ ఆవిష్కరించారు. హింధీ ప్రచార సభలో పాల్గొన్నారు. ఆయన గుంటూరుకు బయలుదేరారు.
డిసెంబర్ 23: గుంటూరు చేరుకున్నారు. ఈ ప్రాంతంలోని చేబ్రోలు, మునిపల్లె, వెల్లలూరు, పొన్నూర్లలో పర్యటించారు. అలాగే జబ్బుపడ్డ కొండా వెంకటప్పయ్య భార్యను పరామర్శించారు. తాళ్ళపాళెంలో ఆయుర్వేద కుటీరాన్ని ప్రారంభించారు. నాయుడు బ్రోలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కావూరులో వినయ్ ఆశ్రమం భవనానికి పునాది వేశారు. ఇక్కడ దళితులనుద్దేశించి మాట్లాడారు. తరువాత తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
|