విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్ దేశభక్తిని ఉత్తేజ పరచిన గడ్డ ఇది.... హోంరూల్ ఉద్యమంతో తెల్లదొరలకు ముచ్చటలు పట్టించిందీ పల్లె.. స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది. సాతంత్ర్య ఉద్యమకారుల ధాటిని తట్టుకోలేక అప్పటి కడప జిల్లా కలెక్టర్ రాయలసీమ జిల్లాల్లో మదనపల్లె ప్రముఖ తీవ్రవాద, తిరుగుబాటు కేంద్రంగా పేర్కొంటూ బ్రిటీష్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాడు.
ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇక్కడి ప్రజల పోరాట పటిమకు నిదర్శనం. బ్రిటీషు పాలకుల బూటు చప్పుళ్ళకు భయపడే రోజులవి. ఇలాంటి పరిస్థితులలో మహాత్మగాంధీ 1929లో బీటీ కాలేజి ఆవరణలో ఏర్పాటు చేసిన బరహిరంగ సభకు 18000 మంది హాజరయ్యారు. గాంధీజీ ఉపన్యాసానికి ఆకర్షితులై ఎంతో మంది మదనపల్లె యువకులు ఉద్యమబాట పట్టారు.
క్విట్ ఇండియా, హోం రూల్ ఉద్యమంలో భాగంగా ఇప్పటి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీటీ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. కార్యాలయాన్ని ముట్టడించి లోపలికి దూసుకెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పట్లో ధర్నాలంటే ఆషామాషీ కాదు. చాలా పెద్ద నేరం కింద జమకడతారు. ఆందోళన చేసే వారిపై బ్రిటీష్ పోలీసులు విచక్షణారహితంగా లాఠీ చార్జీ చేశారు. అప్పటి బీటీ కాలేజి విద్యార్థులైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య, మాజీ ఎమ్మెల్యే సిదాస్, నూతి రాధా కృష్ణయ్యలతోపాటు 40మందిని అరెస్టు చేశారు.
కర్ణాటక రాష్ట్రం, బళ్ళారి జిల్లాలోని అలేపురం జైల్లో నిర్భందించారు. వీరిలో 28 మందికి కోర్టు 9 నెలల జైలు శిక్ష విధించింది. భారతదేశం సగర్వంగా పాడుకునే జాతీయగీతాన్ని జనగణమనను మరాఠీలో రచించారు. 1919లో విశ్వకవి రవీంధ్రనాథఠాగూర్ మదనపల్లె వచ్చారు. నేషనల్ కళాశాలగా ఉన్న ప్రస్తుత బీటీ కళాశాల అప్పటి ప్రిన్సిపల్ కజిన్స్ ఆహ్వానం మేరకు రవీంధ్రుడు కళాశా ఆవరణలో బస చేశారు.
|