ఇక్కడి వాతావణానికి ముగ్ధుడైన విశ్వకవి 1919 ఫిబ్రవరి 28న జనగణమన జాతీయగీతాన్ని ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. దానికి ఇక్కడే బాణీ కట్టినట్లు చెపుతారు. అప్పుడే కళాశాల విద్యార్థలచే ఆలపింపజేశారు. తరువాత అప్పట్లోనే కళాశాల నిత్య పార్థనా గీతంగా మారింది.
ఆ గీతమే నేడు జాతీయగీతంగా ఉంది. ఇలా సాతంత్ర్య సంగ్రామంలో మదన పల్లె సుస్థిర స్థానం సంపాదించుకుంది. ప్రముఖ సాతంత్ర్య సమరయోధులు మదనపల్లెను సందర్శించారు. 1942లో సాగిన క్విట్ ఇండియా ఉద్యమం మదనపల్లెను అట్టుడికించింది. బీటీ కళాశాల విద్యార్థులు తమ పోరాట పటిమను చాటారు.
1946లో కర్ణాటకలోని మైసూర్ ప్రాంత కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకు మదనపల్లె నుంచి 20 మంది ఛలో మైసూర్ కార్యక్రమానికి వెళ్లారు. మార్గ మధ్యమంలో ఉద్యమకారులను పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజులు జైలులో ఉంచారు. ఈ కార్యక్రమానికి నూతి రాధాకృష్ణయ్య నాయకత్వం వహించారు. 1934లో డాక్టర్ బాబు రాజంద్రప్రసాద్ బీటీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించారు.
1936లో ప్రకాశం పంతులు అయ్యదేవర కాళేశ్వర రావు, కల్లూరి సుబ్బరావు, ఆచార్య రంగా, కమలాదేవి ఛటోపాధ్యాయ, మదనపల్లెకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శన, బహిరంగ సభలు జరిగాయి. 1940లో సర్ సీవీ రామన్ బీటీ కాలేజీని సందర్శించారు. 1947 ఆగస్టు15న అర్ధరాత్రి మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇది తెలిసిన విద్యార్థులంతా సమావేశమై బ్రిటీష్ పతాకాన్ని తగులబెట్టారు. మన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వతంత్ర భారత్‌కీ జై అంటూ నినాదాలు చేశారు. |