ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > స్వాతంత్ర్య దినోత్సవం > కలిసి నడుద్దాం... ఉగ్రవాదుల పనిపడదాం...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కలిసి నడుద్దాం... ఉగ్రవాదుల పనిపడదాం...
IVR
WD
అహింసాయుత మార్గంలో బాపూజీ మన దేశానికి స్వేచ్ఛా వాయులను అందించారు. అయితే కొన్ని అసాంఘిక శక్తులు ఈ స్వేచ్ఛా వాతావరణంలో భయోత్పాతాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బెంగుళూరు, అహ్మదాబాదు వరుస పేలుళ్లతో ప్రజలను భీతిగొలిపాయి. దేశంలో ఏ మూలన పేలుడు జరిగినా దాని మూలాలు మన రాష్ట్రరాజధానితో అనుసంధానించబడి ఉండటం కలవరపెడుతున్న మరో అంశం.

నిఘా వర్గాల హెచ్చరికలు చూస్తుంటే... ప్రతి క్షణం, ప్రతి పౌరుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి నేడు నెలకొన్నట్లు కనబడుతోంది. స్వేచ్ఛా భారతంలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యల మధ్య జరుపుకోవాల్సిన దుస్థితి.

నాడు తెల్లదొరల నిరంకుశ పాలనను అంతం చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన నాటి మహనీయుల స్ఫూర్తి... భరతజాతి నరనరాల్లో జీర్ణమై ఉంది. స్వేచ్ఛా వాతావరణాన్ని భగ్నం చేయడానికి ముష్కరులు చేస్తున్న యత్నాలను చూసినప్పుడు ప్రతి పౌరుని హృదయం రగులుతూనే ఉంటుంది. వారి కోపాగ్నికి ఏదో ఒకనాడు ఉగ్రవాదులు మాడిమసైపోక తప్పదు.

అటువంటి మధుర క్షణాలను భరతమాతకు అందిద్దాం. దేశం శాంతియుత వాతావరణంతోనూ, ధనధాన్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లాలనీ ఈ 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోరుకుందాం. అందరం కలిసికట్టుగా ఉగ్రవాదుల పనిపడదాం...

జై హిం ద్ !!

వీడియోను వీక్షించండి
మరిన్ని
"వందేమాతరం" గీతమంటే ప్రాణం : విక్రమ్
పిల్లల్లోనే దేశభక్తి : నవనీత్ కౌర్
ఆ దేవాలయంలో మహాత్ముడే దేవుడు  
దేశభక్తి మూర్తీభవించిన మార్క్సిస్టు 'మణిదీపం'
స్వాతంత్ర్యమే ఊపిరిగా నరనరాన స్వేచ్ఛాగీతిక
తెలుగు గడ్డపై మహాత్ముడు