ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కొత్త వెలుగులు తెచ్చే పండుగ
WD
పండుగలలోకెల్లా మనకు అత్యంత ఆనందానుభూతిని కలిగించే పండుగ సంక్రాంతి. 'సం' అంటే చక్కని అని అర్థం. 'క్రాంతి' అంటే మార్పు. కనుక చక్కని మార్పు అని అర్థం. మన ఆచారాల్లో సమాజ శ్రేయస్సు అంతర్లీనంగా ఉంటుంది. గ్రహగమనం పట్ల, నక్షత్ర సూహాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగిన మన పూర్వులు, దానికి తగిన రీతిగా మన ఆచార వ్యవహారాలను తీర్చిదిద్దారు.

భూమాత సాగిస్తున్న నిరంతర భ్రమణ, పరిభ్రమణాలతో సంక్రాంతి పండుగ ముడివడి ఉంది. ఇది వెలుగుల పండుగ. మకర సంక్రాంతి రోజున ప్రకృతిలో ఓ విధమైన వెలుగుల విప్లవం జరుగుతుంది. మకర సంక్రాంతి రోజు నుంచి ఉత్తరార్థ గోళంలో సూర్యుని కాంతి పెరుగుతుంది. మకర సంక్రాంతికి ముందు ఆరు నెలలపాటు, భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో సూర్యుని కాంతి అంతగా ఉండదు.

చలిలో గజగజా వణికిపోయిన ఆ ప్రాంతమంతా మకర సంక్రాంతి నుంచి వెచ్చటి ఎండలు మొదలవుతాయి. మకర సంక్రాంతి మొదలు ఈ వెలుగుక్రాంతి ఎక్కువవుతూనే ఉంటుంది. చీకటి తగ్గుతుంది. ప్రకృతిలో ఈ మార్పు శుభసూచకం. అందుకే మనం ఆ మార్పును పెద్ద ఎత్తున పండుగగా జరుపుకుంటాం.
మరిన్ని
ముగ్గు ముగ్గుకీ ఓ అర్థముంది
నారాయణ... శ్రీమణ్ణారాయణ...