|
నారాయణునికి ఇష్టమైన భోగి పళ్లు
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | అన్నదాతలైన రైతులకు ముఖ్యమైనది ఈ పండుగ. ఈ పండుగ ద్వారా పాడిపశువుల క్షేమం చేకూరుతుంది. సూర్యుని ఛాయా బేధము వల్ల వచ్చే అశుభాలను తగులపెట్టాలి. అందుకనే ఈ పండుగ భోగి మంటలతో మొదలవుతుంది. సంక్రాంతి సంబరాలలో మొదటిదైన భోగి రోజున ప్రాతఃకాలంలో పెద్దపెద్ద మంటలు వేస్తారు. సాయంత్రం భోగి పళ్ల పేరంటం పేరిట రేగు పళ్లని పిల్లల తలపై పోస్తారు.
ఎందుకంటే రేగు పళ్లంటే శ్రీమన్నారాయణునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. బదరికాశ్రమంలో నరనారాయణులు తపస్సు చేసేటపుడు రేగు పళ్లను మాత్రమే తిన్నారట. అందుకే సాక్షాత్ ఆ నారాయణుని దీవెన అన్నట్లు పిల్లల తలపై రేగు పళ్లను పోసి, పెద్దలు తమ ఆశీస్సులను అందజేస్తారు.
అలాగే గోదాదేవి భక్తికి మెచ్చి విష్ణువు ఆమెను వివాహం చేసుకోవటం వల్ల, భోగినాడు దక్షిణాది విష్ణుమూర్తి ఆలయాలలో ప్రతి ఏటా సంప్రదాయబద్దంగా కళ్యాణం జరిపిస్తుంటారు. భోగి మంటలు, అభ్యంగన స్నానం, పొంగలి, నివేదన, భోగి పళ్లు, వాయనాలు, బొమ్మల కొలువు, గొబ్బి పూజలతో భోగి పండుగ ఆనందంగా జరుగుతుంది.
|