ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గగనంలో గాలిపటాల సమరం
PTI PhotoPTI
పోరాటం కొనసాగుతుండగానే అదను చూసి మూడవ మేడ గాలిపటం, ఒకటవ మేడ గాలిపటానికి ఆధారమైన దారాన్ని వాడిగా ఉన్న తన దారంతో తెంపేసింది.... ఇంకేముంది... ఒకటవ మేడ వీక్షకుల నుంచి హాహాకారాలు, మూడవ మేడ నుంచి జయజయధ్వానాలు... తల వాల్చుకుంటూ కిందకు జారుతున్న గాలిపటం ఎక్కడికి చేరుకుంటుందోనని ఓడిపోయిన వారి ఆతృత.... కిందకు జారుతున్న గాలిపటాన్ని ఎలాగైనా చేజిక్కుంచుకుని ఆనంద సంబరాలు చేసుకోవాలని గెలిచిన వారి ఉత్సుకత.... వెరసి గాలిపటం ఎవరి స్వంతమవుతుందనే ఉత్కంఠ... అలా అలా కిందకు జారిన గాలిపటం రోడ్డుపై పడిందో లేదో... సైకిల్ మీద రివ్వున వచ్చిన ఓ గడుగ్గాయి, ఒక్కసారిగా సైకిల్ ఆపేసి, కన్నుమూసి కన్ను తెరిచేలోగా గాలిపటాన్ని స్వంతం చేసుకుని అదే వేగంతో పరార్....

ఇరు వర్గాలు ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా అప్పటిదాకా విజయాన్ని తలకెక్కించుకున్న మూడవ మేడ గాలిపటాన్ని మరో గాలిపటం వచ్చి పుటుక్కున తెంపేసింది. మూడవ వాడికి కాకుండా తామిరువురులో ఒకరికే దక్కాలనే సరికొత్త సంఘీభావంతో రెండు మేడలకు చెందిన పిల్లలు పరుగులు తీస్తున్నారు... గాలిపటం దిశకు అనుగుణంగా... ఈ సారి ఎవరికి దక్కుతుంది? మరో గడుగ్గాయి రాకపోవచ్చునని ఎలా చెప్పగలం...
 << 1 | 2   
మరిన్ని
మొక్కుల పండుగ మకర సంక్రాంతి
నారాయణునికి ఇష్టమైన భోగి పళ్లు
సర్వపాపాలను తొలగించే సంక్రాంతి పురుషుడు
కొత్త వెలుగులు తెచ్చే పండుగ
ముగ్గు ముగ్గుకీ ఓ అర్థముంది
నారాయణ... శ్రీమణ్ణారాయణ...