ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > మకర సంక్రాంతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బెల్లపు/చక్కెర అరిసెలు
FileFILE
కావలసిన వస్తువులు:

బియ్యం/చక్కెర - అర కేజీ
బెల్లం - 500 గ్రాములు
నూనె లేక నెయ్యి - కాల్చేందుకు సరిపడ
యాలగలు - రెండు లేదా మూడు
నువ్వులు - 50 గ్రాములు

ఎలా తయార చేస్తార

ముందుగా బియ్యాన్ని రాళ్లు లేకుండా శుభ్రం చేసుకుని ఒక రోజు ముందుగా నానబెట్టుకోవాలి. రెండవ రోజు నీటిని వడగట్టి, కొద్దిగా బియ్యం పొడిగా అయ్యేవిధంగా ఎండకు ఆరబెట్టుకోవాలి. తర్వాత ఈ బియ్యాన్ని పిండి పట్టుకోవాలి. పిండిని రెండు సార్లు జల్లిస్తే అరిసెలు బాగుంటాయి. తరువాత బెల్లాన్ని మెత్తగా దంచి అడుగు మందం ఉన్న గిన్నెలో వేసి ఓ కప్పు నీళ్ళుపోసి పొయ్యి మీద పెట్టాలి. బెల్లం కరిగి పాకం అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. (ఈ పాకంలో రెండు రకాలు ఉన్నాయి. ముదురు పాకం, మరొకటి లేత పాకం.

మీకు ఇష్టమైన పాకంలో దీన్ని పట్టుకోవాలి.) ఇప్పుడు ఒక ప్లేటులో కొంచెం నీళ్ళు పోసి పాకం కొంచెం అందులో వెయ్యాలి. ఆ తర్వాత ఇప్పుడు బియ్యం పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలపాలి. ఆ పిండిని గుండ్రలుగా చేసుకుంటూ.. కాగుతున్న నూనెలో వేసి దోరగా కాల్చాలి. ఆ తర్వాత వాటిని తీసి నూనె పోయేట్లుగా రెండు గరిటలతో బాగా ఒత్తి వాటిని గాలికి ఆరబెట్టాలి. అవి ఆరిన తరువాత గాలివెళ్ళని డబ్బాలో భద్రపరుచుకోవాలి.
మరిన్ని
మురుకులు (జంతికలు)
గగనంలో గాలిపటాల సమరం
మొక్కుల పండుగ మకర సంక్రాంతి
నారాయణునికి ఇష్టమైన భోగి పళ్లు
సర్వపాపాలను తొలగించే సంక్రాంతి పురుషుడు
కొత్త వెలుగులు తెచ్చే పండుగ