కావలసిన వస్తువులు:
సెనగ పిండి : 4 గ్లాసులు బియ్యం పిండి : ఒక గ్లాసు. వాము : 2 టీ స్పూన్లు. నూనె : 1/2 కిలో. నెయ్యి : 4 టీ స్పూన్లు. ఉప్పు, కారం : సరిపడేంత.
తయారుచేసే విధానం
ముందుగా ఒక గిన్నెలో సెనగ పిండిని, బియ్యం పిండిని జల్లించి, వామ్ము కూడా మెత్తగా దంచి జల్లించి వేసి ఉప్పు, కారం, నెయ్యి వేసి కొంచెం నీళ్ళు పోసి కొంచెం గట్టిగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత జంతికల గొట్టంలో లేక చక్రాల గిద్దలో సన్నని చిల్లుల రేకు ఉంటుంది. దానిని గొట్టంలో బిగించి పిండిని అందులో వేసి నూనెలో వత్తాలి. బాగా వేగిన తరువాత తీసి డబ్బాలో వేసుకోవాలి.
|